HomePolitical Newsరసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది

రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది

రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది
రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది

వ్యవసాయరంగంలో ఏపీ సర్కారు సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. రసాయనాలు లేని ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆరున్నర లక్షల మంది రైతులతో 2.88లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు చేపట్టింది. రాష్ట్రంలో చేపట్టిన ప్రకృతి సాగును 15 దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం పరిశీలించింది. మూడు రోజులుగా అనంతపురం జిల్లాలో పర్యటించిన బృందం సాగు వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంది.

ప్రకృతిసాగు ఆదర్శనీయమని కొనియాడింది. తమ దేశాల్లోనూ ప్రకృతిసాగుకు చర్యలు తీసుకుంటామని బృందం ప్రకటించింది. కాగా మూడురోజుల పర్యటన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధుల బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రి.

- Advertisement -

ఈ సందర్భంగా మాట్లాడిన కాకాణి సాగులో భూమికి, రైతుకి.. ఆహారం తీసుకునే వారికి నష్టం ఉండొద్దన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు . ఏపీ వ్యవసాయ విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా చేపట్టిన ప్రకృతిసాగును 15 దేశాల విదేశీ ప్రతినిధుల బృందం పరిశీలించడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు మంత్రి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All