Homeటాప్ స్టోరీస్నాగ్ కు పెయిర్ గా మెహ్రీన్

నాగ్ కు పెయిర్ గా మెహ్రీన్

నాగ్ కు పెయిర్ గా మెహ్రీన్
నాగ్ కు పెయిర్ గా మెహ్రీన్

అక్కినేని నాగార్జునకు హీరోయిన్ కష్టాలు వెంటాడుతూ వచ్చాయి. సీనియర్ హీరోల్లో ఇంకా గ్లామర్ ను మైంటైన్ చేస్తోన్న నాగ్ కు హీరోయిన్ కష్టాలు రావడం కొంత వింతే. అయితే సీనియర్ హీరోలందరి తరహాలోనే నాగ్ సినిమాకు హీరోయిన్ దొరకలేదు. నాగ్ నెక్స్ట్ సినిమా బంగార్రాజుకు నాగ్ పెయిర్ గా రమ్యకృష్ణ నటించింది. అయితే గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్ర షూటింగ్ కు కొన్ని కారణాల వల్ల బ్రేకులు పడ్డాయి. వచ్చే నెలలో తిరిగి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాకు ముందుగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసారు కానీ ఆమె పర్సనల్ కారణాల వల్ల ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేసింది. దాంతో నిర్మాతలు చాలా మంది హీరోయిన్లను పరిశీలించారు. అమలా పాల్ ను కన్ఫర్మ్ చేసారు కూడా. అయితే ఆమె గొంతెమ్మ కోర్కెలకు భయపడి వద్దనుకున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం నాగ్ కు పెయిర్ దొరికారు.

- Advertisement -

మెహ్రీన్ ను ది ఘోస్ట్ లో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో మెహ్రీన్ కూడా పాల్గొంటుంది. ఆమెకి సాధారణంగా ఇచ్చే పారితోషికం కాకుండా మరింత ఎక్కువ ఈ చిత్రం కోసం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

తనలో గ్లామర్ కోణాన్ని బయటకు తీస్తోన్న మెహ్రీన్

ఎఫ్3లో కీలక పాత్రలో కనిపించనున్న సోనాల్ చౌహన్

“ఇలానే చేస్తే సినిమా ఇండస్ట్రీ నాశనమవుతుంది” : సురేష్ బాబు

భీమ్లా నాయక్ కు త్రివిక్రమ్ పారితోషికం: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All