Homeటాప్ స్టోరీస్తనలో గ్లామర్ కోణాన్ని బయటకు తీస్తోన్న మెహ్రీన్

తనలో గ్లామర్ కోణాన్ని బయటకు తీస్తోన్న మెహ్రీన్

తనలో గ్లామర్ కోణాన్ని బయటకు తీస్తోన్న మెహ్రీన్
తనలో గ్లామర్ కోణాన్ని బయటకు తీస్తోన్న మెహ్రీన్

నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన మెహ్రీన్ కౌర్, ఆ తర్వాత తెలుగులో బాగానే సినిమాలు చేసింది. ఆమె కెరీర్ లో రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఎఫ్2 అంటూ హిట్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే మెహ్రీన్ ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామనుకుంది. రాజకీయ నాయకుడు భవ్యతో ఆమె నిశ్చితార్ధం వరకూ వెళ్ళింది. పెళ్ళైన తర్వాత సినిమాలు కూడా మానేస్తానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న ఎఫ్3 ఆమె కెరీర్ లో చివరి చిత్రమని అనుకున్నారంతా.

కానీ అనూహ్యంగా నిశ్చితార్ధానికి ముందే ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో తిరిగి సినిమాలు చేయాలని డిసైడ్ అయింది. దాంతో పాటు అప్పటివరకూ గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు పెట్టుకున్న మెహ్రీన్ దాన్ని మరికొంచెం సడలించినట్లు తెలుస్తోంది. మెహ్రీన్ నటించిన మంచి రోజులు వచ్చాయి చిత్రంలో గ్లామరస్ గానే కనిపిస్తోంది  ఈ భామ. అలాగే షూటింగ్ దశలో ఉన్న ఎఫ్3 కు సంబంధించిన పోస్టర్లలో కూడా మెహ్రీన్ గ్లామర్ డోస్ ను చూడొచ్చు.

- Advertisement -

మంచి రోజులు వచ్చాయి చిత్రం రిలీజ్ కు దగ్గరపడుతోన్న సమయంలో మెహ్రీన్ చేసిన ఒక ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. క్లివేజ్ షో తో పాటు గ్లామర్ ట్రీట్ బాగానే ఇచ్చింది ఈ భామ.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN ?? (@mehreenpirzadaa)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All