Homeన్యూస్"ఇలానే చేస్తే సినిమా ఇండస్ట్రీ నాశనమవుతుంది" : సురేష్ బాబు

“ఇలానే చేస్తే సినిమా ఇండస్ట్రీ నాశనమవుతుంది” : సురేష్ బాబు

"ఇలానే చేస్తే సినిమా ఇండస్ట్రీ నాశనమవుతుంది" : సురేష్ బాబు
“ఇలానే చేస్తే సినిమా ఇండస్ట్రీ నాశనమవుతుంది” : సురేష్ బాబు

అగ్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు గురించి చెప్పాలంటే చాలా ప్రాక్టికల్ మనిషని చెప్పొచ్చు. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత పెడితే సేఫ్ గా బయటపడొచ్చు అన్నది సురేష్ బాబుకి బాగా తెలుసు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా భారీ నష్టాలు తెచ్చి పెట్టిన చిత్రాలు పెద్దగా ఉండవు. కరోనా సమయంలో తాను నిర్మించిన చిత్రాలను ఓటిటిలో రిలీజ్ చేసాడు.

దీనిపై పలు విమర్శలు వచ్చాయి కూడా. అయినా కానీ సురేష్ బాబు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన చిత్రాలకు నష్టాలు వస్తే నేనే కదా భరించాలి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా సెన్సిబుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కనిపించే సురేష్ బాబు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ ధరల నిర్ణయంపై స్పందించాడు. ఈ నిర్ణయం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాడు.

- Advertisement -

“ప్రతీ ప్రోడక్ట్ కు ఒక్కో ధర అనేది ఉంటుంది. చిన్న సినిమాకు, పెద్ద సినిమాకు కూడా ఒకే రేటు అనడం ఏంటో నాకు అర్ధం కాలేదు. ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాల బడ్జెట్స్ పై చాలా ఎఫెక్ట్ పడుతుంది. బ్లాక్ టికెట్ల గురించి మాట్లాడుతున్నారు. మూవీ విడుదలైన ఒకట్రెండు రోజుల తర్వాత బ్లాక్ అనే మాట ఉండదు. ఇప్పుడున్న రేట్లతో కనీసం థియేటర్లకు ఎలక్ట్రిసిటీ చార్జెస్ కూడా రావు. ఇలానే ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని విస్మరిస్తూ వస్తే అది నాశనమవ్వడం ఖాయం” అని కుండబద్దలు కొట్టాడు.

ఇవి కూడా చదవండి:

ఓటిటి డీల్స్ తో దూసుకుపోతోన్న సురేష్ బాబు

నాగార్జున చేతిలో మోసపోయిన సురేష్ బాబు

కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్న సురేష్ బాబు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All