Homeగాసిప్స్బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున కాదా?

బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున కాదా?

బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున కాదా?
బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున కాదా?

దేశ వ్యాప్తంగా బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అన్ని ప్రాంతీయ భాష‌ల్లోనూ బిగ్‌బాస్ షో సంచ‌ల‌నం సృష్టించింది. వివాదాలు, విమ‌ర్శ‌ల కార‌ణంగా బాగానే పాపుల‌ర్ అయింది. ఈ షోలో ఒక్క సారైనా పాల్గొనే అవ‌కాశాన్ని ద‌క్కించుకోవాల‌ని చాలా మంది సెల‌బ్రిటీలు, న‌టీన‌టులు ఎదురుచూస్తున్నారంటే బిగ్‌బాస్ ఏ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారిందో అర్థం చేసుకోవ‌చ్చు. బిగ్ బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది.

దీనిపై ప్ర‌స్తుతం చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేయ‌డం మొద‌లైంది. హీరో త‌రుణ్, మంగ్లీ, తాజాగా బిత్తిరి స‌త్తిల‌ని ఈ షో కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎంపిక చేశారు. ఈ సీజ‌న్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్య‌వ‌హ‌రిస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త సీజ‌న్‌కు నాగార్జునే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సీజ‌న్‌కి కూడా ఆయ‌నే వుంటార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అయితే తాజాగా మ‌రో స్టార్ పేరు కూడా వినిపిస్తోంది. ఆ స్టార్ మ‌రెవ‌రో కాదు స‌మంత‌. య‌స్ సీజ‌న్ 4కు హోస్ట్‌గా స‌మంత వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం వుంద‌ని, ఆమె హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తే షోకు మ‌రింత గ్లామ‌ర్ యాడ‌వుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఇందు కోసం భారీగానే పారితోషికం ఇస్తామంటూ మేక‌ర్స్ ఆఫ‌ర్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All