Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్ హౌస్‌లోకి బిత్తిరి స‌త్తి!

బిగ్‌బాస్ హౌస్‌లోకి బిత్తిరి స‌త్తి!

బిగ్‌బాస్ హౌస్‌లోకి బిత్తిరి స‌త్తి!
బిగ్‌బాస్ హౌస్‌లోకి బిత్తిరి స‌త్తి!

బిగ్‌బాస్ రియాలిటీ షో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న వారంతా ఆ త‌రువాత సెల‌బ్రిటీలుగా మారిపోయారు. కొంత మంది అవ‌కాశాలు రాని స్టార్స్ బిగ్ బాస్ త‌రువాత బిజీగా మారిపోయారు. తాజాగా బిగ్‌బాస్ సీజ‌న్ మ‌ళ్లీ ప్రారంభం కాబోతోంది. గ‌త సీజ‌న్‌లో రాహుల్ సిప్లిగంజ్‌, శ్రీ‌ముఖి పోటీప‌డ‌గా చివ‌రికి రాహుల్ టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు.

ఈ ద‌ఫా బిగ్‌బాస్ జూన్‌లో ప్రారంభం కావాల్సింది. అయితే క‌రోనా క్రైసిస్ కార‌ణంగా దీనికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వ‌డానికి మేక‌ర్స్ ఆలోచిస్తున్నారు. క‌రోనా వేళ ఈ షోని ర‌న్ చేయ‌డం ఎలా అనే సంది‌గ్ధ‌‌త నెల‌కొంది. పైగా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి నాగార్జున ఆస‌క్తిని చూపించ‌డం లేదు. దీంతో బిగ్‌బాస్ లేటెస్ట్ సీజ‌న్ క‌ష్ట‌మ‌నే వాద‌న‌లు వినిపించాయి. తాజాగా నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి ఓకే చెప్ప‌డంతో మ‌రోసారి బిగ్‌బాస్ సీజ‌న్ 4 వార్త‌ల్లో నిలిచింది. ఇప్ప‌టికే కొంత మంది కంటెస్టెంట్‌ల‌ని ప్ర‌క‌టించిన మాటీవీ తాజాగా బిత్తిరి స‌త్తిని కూడా ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

టీవీ9 నుంచి బిత్తిరి స‌త్తి ఈ మంగ‌ళ‌వారం బ‌య‌టికి వ‌చ్చాడు. ఈ స‌మ‌యంలో అత‌నికి బిగ్ బాస్ సీజ‌న్ 4లో అవ‌కాశం ద‌క్క‌డం విశేషం అని అత‌న్ని అభిమానించే వారు చెబుతున్నారు. బిత్తిరి స‌త్తితో పాటు హీరో త‌రుణ్‌, సింగ‌ర్ మంగ్లీల‌ని కంటెస్టెంట్‌లుగా ఫైన‌ల్ చేశార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All