Homeగాసిప్స్బిగ్‌బాస్ సీజ‌న్ 4పై షాకింగ్ న్యూస్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4పై షాకింగ్ న్యూస్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4పై షాకింగ్ న్యూస్‌!
బిగ్‌బాస్ సీజ‌న్ 4పై షాకింగ్ న్యూస్‌!

బుల్లితెర‌పై పాపుల‌ర్ అయిన షో బిగ్‌బాస్‌. ఉత్త‌రాదికే ప‌రిమిత‌మైన బిగ్‌బాస్ షో తెలుగులో నాగార్జున ద్వారా, త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ ద్వారా ద‌క్షిణాదికి పాకిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల నాగార్జున వ్యాఖ్య‌తగా వ్య‌వ‌హ‌రించిన సీజ‌న్ 3 బిగ్ హిట్ కావ‌డంతో సీజ‌న్ 4పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. స్టార్ మ‌లో ప్ర‌సారం కానున్న ఈ రియాలిటీ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ షోలో హీరో త‌రుణ్‌, మంగ్లీ, వ‌ర్షిని, అఖిల్ స‌ర్త‌క్ పాల్గొంటార‌ని, త్వ‌ర‌లోనే మ‌రి కొంత మంది కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేసి ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ అస‌లు ఈ ఏడాది ఈ షో జ‌రిగే అవ‌కాశం లేద‌ని తాజాగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ సెవెన్ ఎక‌ర్స్‌లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో ఈ షోని నిర్వ‌హించ‌బోతున్నారు.

- Advertisement -

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ షోకు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. సోష‌ల్ డిస్టెన్స్‌ని మెయింటైన్ చేస్తూ ఈ షోని నిర్వ‌హించ‌డం క‌ష్టం కాబ‌ట్టి ఈ షోకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డం క‌ష్టం అని ప్ర‌చారం మొద‌లైంది. దీనిపై షో నిర్వాహ‌కులు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేస్తారో చూడాలి. ఒక వేళ ప్ర‌భుత్వం అనుమ‌తిస్తే దీనికి నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హిస్తారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All