
బుల్లితెరపై రాములమ్మగా తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోంది శ్రీముఖి. బిగ్‌బాస్ రియాలిటీ షోతో యరింతగా పాపులర్ అయిన శ్రీముఖి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `ఇట్స్ టైమ్ టు పార్టీ`. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి క్రిష్ సిద్ధిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్‌టైల్ సినిమాస్ బ్యానర్‌పై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మిస్తున్నారు. శ్రీముఖు పుట్టిన రోజు సందర్భంగా శ్రీముఖి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ `ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుతం సమాజంలో యువతరం జీవితాలకు అద్ధం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాలో శ్రీముఖి పూర్తి స్థాయి పాత్రలో నటించడం లేదు కానీ ఆమె పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది. గతంలో ఈ తరహా పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా చాలా కొత్తగా సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. ఈ పాత్రలో శ్రీముఖి అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో వున్నాయి` అన్నారు.
`బాబు బాగా బిజీ` చిత్రం తరువాత శ్రీముఖి మరో సినిమాలో నటించలేదు. ఆమె సినిమా వచ్చి దాదాపు మూడేళ్లకు పైనే అవుతోంది. మూడేళ్ల గ్యాప్ తరువాత శ్రీముఖి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుంటుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : అనిల్ కుమార్. పి, కెమెరా: దిలీప్ కుమార్ ఎం.ఎస్. సంగీతం : శేఖర్ మోపూరి, సహ నిర్మాత : సి.హెచ్. వేణుమాధవ్.