
శ్రీముఖి.. బుల్లితెరపై ఆ పేరు పాపులర్. ఝాన్సీ, సుమల తరువాత ఆ స్థానంలో నిలిచింది. అయిఏత హీరోయిన్‌కు వుండాల్సిన గ్లామర్ తనకు వున్నా శ్రీముఖి ఎందుకు సినిమాల్లో రాణించలేకపోయింది. స్టార్ డైరెక్టర్‌లు అఫర్లిచ్చినా వాటిని ఎందుకు సున్నితంగా తిరస్కరించింది?. ఆమె నటించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది. అంటే శ్రీముఖి ఆసక్తకర విషయాల్ని బయట పెట్టింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `జులాయి` చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో బన్నీకి చెల్లెలుగా శ్రీముఖి నటించింది. అయితే ఆ తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, చంద్రిక, ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రాపోరి, నేను శైలజ, సావిత్రి, జెంటిల్‌మన్, మనలో ఒక్కడు, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లో నటించింది.
అయితే ఆ తరువాత నటనని కంటిన్యూ చేయకపోవడానికి దర్శకులు పెట్టిన కండీషన్సేనని చెబుతోంది శ్రీముఖి. భారీగానే ఆఫర్లు వచ్చినా ఎక్స్‌పోజింగ్ చేయాలని, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాలని కండీషన్స్ పెట్టారట. దాంతో కుదరదని చెప్పి శ్రీముఖి యాంకరింగ్‌కే పరిమితమైపోయిందట. అయితే అర్థాంతరంగా ఆగిపోయిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` గురించి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పలేదు.