Homeన్యూస్ఫస్ట్ లుక్: బంగార్రాజులో నాగలక్ష్మిగా కృతి శెట్టి

ఫస్ట్ లుక్: బంగార్రాజులో నాగలక్ష్మిగా కృతి శెట్టి

ఫస్ట్ లుక్: బంగార్రాజులో నాగలక్ష్మిగా కృతి శెట్టి
ఫస్ట్ లుక్: బంగార్రాజులో నాగలక్ష్మిగా కృతి శెట్టి

అక్కినేని నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సూపర్ డూపర్ హిట్ అయిన నేపథ్యంలో మళ్ళీ ఇన్నేళ్లకి వారి నుండి దీనికి సీక్వెల్ వస్తోంది. ఈ చిత్రానికి బంగార్రాజు అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఎక్కువ సమయం ఉన్న ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాక మాత్రం దూసుకుపోయింది.

రికార్డ్ సమయంలో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం సంక్రాంతి రేసులో నిలవడానికి ఎదురుచూస్తోంది. ఇప్పటికే విడుదలైన చిత్రాల్లో ఒక్క సినిమా తప్పుకున్నా కానీ బంగార్రాజును రేసులో నిలబెడతాడు నాగార్జున. ఇదిలా ఉంటే బంగార్రాజు ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన సాంగ్ లడ్డుండ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

- Advertisement -

ఇక ఇప్పుడు ఈ చిత్రంలో నటిస్తోన్న కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఉప్పెన తర్వాత కృతి శెట్టి పలు చిత్రాలను సైన్ చేసింది. నాని శ్యామ్ సింగ రాయ్ తర్వాత బంగార్రాజులో కీలక పాత్రను పోషించింది. ఈ చిత్రంలో నాగ చైతన్య పెయిర్ గా నటించింది. నాగలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రను కృతి శెట్టి పోషిస్తోంది. నాగార్జున పెయిర్ గా రమ్యకృష్ణ నటిస్తోన్న విషయం తెల్సిందే. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

మరో రెండు సినిమాలను సైన్ చేసిన కృతి శెట్టి

జీ టివితో సూపర్బ్ డీల్ సెట్ చేసుకున్న కృతి శెట్టి

మూడు నెలల గ్యాప్ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తోన్న కృతి శెట్టి

కృతి శెట్టి ఆలోచన వెనుక ఆ నిర్ణయమే ఉంది మరి

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All