Homeటాప్ స్టోరీస్మరో రెండు సినిమాలను సైన్ చేసిన కృతి శెట్టి

మరో రెండు సినిమాలను సైన్ చేసిన కృతి శెట్టి

మరో రెండు సినిమాలను సైన్ చేసిన కృతి శెట్టి
మరో రెండు సినిమాలను సైన్ చేసిన కృతి శెట్టి

ఉప్పెన భామ కృతి శెట్టికి వరసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. నాని చిత్రం శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేసిన కృతి శెట్టి సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని ఉంది చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తాజా సమాచారం ప్రకారం రెండు చిత్రాలను సైన్ చేసింది కృతి శెట్టి.

నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బంగార్రాజు చిత్రంలో నాగ చైతన్య నటిస్తున్నాడు. నాగ చైతన్య సరసన కీలక పాత్రలో కృతి శెట్టి చేస్తోంది. రీసెంట్ గా ఆమె ఈ సినిమాను సైన్ చేసింది కూడా.

- Advertisement -

దీంతో పాటు నితిన్ లేటెస్ట్ సినిమాను కూడా కృతి శెట్టి ఓకే చేసింది. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ ఈ కథను ఓకే చేసాడు. కృతి శెట్టిను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఉప్పెన భామ డైరీ ఇప్పుడు ఫుల్ అయిపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All