Homeటాప్ స్టోరీస్శ్రీదేవి కూతురు జాన్వీ ధఢక్ ఎలా ఉందంటే

శ్రీదేవి కూతురు జాన్వీ ధఢక్ ఎలా ఉందంటే

janhvi kapoor dhadak premiere show talkఅతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ రూపొందించిన చిత్రం ” ధఢక్ ”. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది . అయితే నిన్ననే ఈ సినిమా సందడి మొదలయ్యింది ముంబై లో . పలువురు సినీ , రాజకీయ ప్రముఖులకు నిన్న ప్రీమియర్ షోలు వేసారు కరణ్ జోహార్ . ధడక్ సినిమా చూసిన వాళ్ళు జాన్వి కపూర్ నటన కు ముగ్దులయ్యారు , మొదటి చిత్రంతోనే నటనలో తల్లికి తగ్గ తనయురాలు అంటూ కీర్తిస్తున్నారు క్రిటిక్స్ .

మరాఠీ లో సంచలన విజయం సాధించిన ” సైరత్ ” చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసారు . హీరో హీరోయిన్ ల నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో అటు హీరో ఇషాన్ కట్టర్ కు ఇటు జాన్వి కపూర్ నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి . అంతేకాదు ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని ప్రశంసలు వస్తున్నాయి . కరణ్ జోహార్ సినిమా నిర్మించడం వల్ల ఈ సినిమాకు ఎక్కడా లేని ప్రాధాన్యత వచ్చింది అలాగే శ్రీదేవి కూతురు మొదటి చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది . మొత్తానికి ధడక్ చిత్రానికి రివ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి . బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు కాని సూపర్ హిట్ అవ్వడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . అయితే క్రిటిక్స్ విషయాన్నీ పక్కన పెడితే యువత ని ఆకట్టుకునే చిత్రం కాబట్టి వాళ్ళకు నచ్చితే మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళడం ఖాయం .

- Advertisement -

English Title: janhvi kapoor dhadak premiere show talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All