Homeటాప్ స్టోరీస్శ్రీదేవి కూతురు నటించిన ధడక్ ట్రైలర్ వచ్చింది

శ్రీదేవి కూతురు నటించిన ధడక్ ట్రైలర్ వచ్చింది

dhadak trailer outఅతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం ” ధడక్ ”. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది . మరాఠీలో సంచలన విజయం సాధించి వంద కోట్లకు పైగా వసూళ్ల ని కొల్లగొట్టింది . ఓ చిన్న చిత్రంగా విడుదలై ప్రభంజనం సృష్టించింది మరాఠీ చిత్ర పరిశ్రమలో ” సైరత్ ” అనే చిత్రం . ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన సైరత్ ని బాలీవుడ్ లో ధఢక్ గా రీమేక్ చేస్తున్నారు .

జాహ్నవి కపూర్ హీరోయిన్ కాగా ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు . ఇద్దరు కూడా మంచి జోడి అనిపించుకున్నారు . యువతకు బాగా నచ్చేలా ట్రైలర్ ని కట్ చేసారు . జాహ్నవి కి హీరోయిన్ గా మంచి భవిష్యత్ ఉందని చెప్పకనే చెబుతోంది ఈ ట్రైలర్ . కరణ్ అర్జున్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ కైతన్ దర్శకత్వం వహించాడు . ధఢక్ ట్రైలర్ యూత్ కి నచ్చేలా ఉండటంతో సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర బృందం . సినిమాలు ఎక్కువగా చూసేది యూత్ కాబట్టి ధఢక్ తో జాహ్నవి భారీ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు . జూలై 20న ఈ చిత్రం విడుదల కానుంది , అప్పుడు జాహ్నవి భవితవ్యం తేలిపోనుంది .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All