Homeటాప్ స్టోరీస్అర్జున్ రెడ్డి ని తిరస్కరించిన హీరోయిన్

అర్జున్ రెడ్డి ని తిరస్కరించిన హీరోయిన్

jhanvi refused arjun reddy remakeఅర్జున్ రెడ్డి చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే తిరస్కరించిందట అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి . తెలుగునాట అర్జున్ రెడ్డి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు . చిన్న చిత్రంగా వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం సంచలనం సృష్టించింది దాంతో ఆ సినిమాని అన్ని బాషలలో రీమేక్ చేయడానికి పోటీపడ్డారు పలువురు సినీ ప్రముఖులు . ఆ కోవలోనే హిందీలో కూడా అర్జున్ రెడ్డి ని రీమేక్ చేయడానికి పలువురు ముందుకు రాగా తానే రీమేక్ చేస్తానని వచ్చిన వాళ్ళని తిరస్కరించాడు అర్జున్ రెడ్డి దర్శకుడు వంగా సందీప్ రెడ్డి . షాహిద్ కపూర్ ని హీరోగా అనుకున్న తర్వాత హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్నవిని అనుకున్నాడట దర్శకులు సందీప్ రెడ్డి వంగా .

జాహ్నవి కూడా అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రంలో నటించడానికి సుముఖత వ్యక్తం చేసింది , అయితే దర్శక నిర్మాత కరణ్ జోహార్ అడ్డుపడ్డాడట ఎందుకంటే కెరీర్ ప్రారంభంలోనే బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్న చిత్రంలో నటిస్తే కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని హితబోధ చేసాడట దాంతో మంచి ఆఫర్ అయినప్పటికీ అర్జున్ రెడ్డి ని తిరస్కరించిందట జాహ్నవి . మరాఠీలో సంచలన విజయం సాధించిన ”సైరత్ ” రీమేక్ లో నటిస్తోంది . ఇక ఆ సినిమా విడుదలకు సిద్దమయింది . ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది దాంతో దఢక్ సినిమా హిట్ పై నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All