Homeటాప్ స్టోరీస్తప్పంతా నాదే అంటున్న స్టార్ హీరో

తప్పంతా నాదే అంటున్న స్టార్ హీరో

Its my blunder mistake : AAMIR KHANథగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ప్లాప్ కావడానికి ఎవరో కారణం కాదు , తప్పంతా నాదే ‘ అని అంటున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ . అమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్ , కత్రినా కైఫ్ లు నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం ఇటీవలే విడుదలై ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ బాహుబలి ని ఢీకొట్టే చిత్రం అంటూ ప్రచారం జరిగింది . ఆ ప్రచారానికి తగ్గట్లుగా అమితాబ్ , అమీర్ , కత్రినా లు నటించడంతో ఈ సినిమాపై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి .

అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ . ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో ఆందోళన చేపట్టారు కూడా . కానీ నిర్మాత నుండి మాత్రం హామీ లభించలేదు . కట్ చేస్తే ఇప్పుడు అమీర్ ఖాన్ క్షమాపణ చెబుతున్నాడు . తప్పంతా నాదే ! ఏదో అనుకోని చేసాం …. ఇంకేదో అయ్యింది కాబట్టి తప్పు వేరే వాళ్ళ మీద నెట్టేయలేం అంటూ సెలవిచ్చాడు కానీ భారీగా నష్టపోయిన బయ్యర్ల పరిస్థితి ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు అమీర్ ఖాన్ .

- Advertisement -

English Title: Its my blunder mistake : AAMIR KHAN

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All