Homeటాప్ స్టోరీస్శాటిలైట్ , డిజిటల్ రైట్స్ కి 180 కోట్లా ?

శాటిలైట్ , డిజిటల్ రైట్స్ కి 180 కోట్లా ?

Huge price for 2. 0 satillite and digital rightsరజనీకాంత్ నటించిన 2.0 అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . కాగా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడు పోవడం సంచలనం సృష్టిస్తోంది అలాగే డిజిటల్ రైట్స్ కి మరో 60 కోట్లు వెరసి 180 కోట్లు వచ్చాయట . ఇది రజనీకాంత్ – శంకర్ ల కున్న ఇమేజ్ కి తార్కాణం . తెలుగు , తమిళ్ , హిందీ సాటిలైట్ రైట్స్ తో పాటుగా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకొని 180 కోట్లకు ఒప్పందం చేసుకున్నారట . సినిమా బడ్జెట్ 550 కోట్లు కాగా అందులో 180 కోట్లు శాటిలైట్ , డిజిటల్ హక్కుల రూపంలో వచ్చింది .

అంటే ఇంకా 370 కోట్లు థియేట్రికల్ రైట్స్ రూపంలో రావాలన్న మాట . ఆ స్థాయిలో కాకపోయినా 280 కోట్ల మేర అన్ని భాషలు కలుపుకొని వచ్చే ఛాన్స్ ఉంది . అయినప్పటికీ మరో 90 కోట్లు రావాల్సిందే . అంటే 2. 0 బాహుబలి చిత్రంలా రికార్డుల మోత మోగిస్తే అటు నిర్మాతలు ఇటు బయ్యర్లు అలాగే థియేటర్ యజమానులు అందరూ లాభాల బాటలో పయనిస్తారు . ఏమాత్రం తేడా వచ్చినా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం లా అందరూ నష్టపోతారు . అయితే 2. 0 చిత్రానికి సెన్సార్ టాక్ అయితే బాగుంది , ఆ టాక్ నిజమే అయితే తప్పకుండా హిట్ కొట్టేస్తాడు లేదంటే షరా మాములే !

- Advertisement -

English Title: Huge price for 2. 0 satillite and digital rights

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All