Homeటాప్ స్టోరీస్రజనీకాంత్ 2. 0 సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా

రజనీకాంత్ 2. 0 సెన్సార్ టాక్ ఎలా ఉందో తెలుసా

Rajinikanth's 2.0 censor talk సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది దాంతో సెన్సార్ టాక్ కూడా స్ప్రెడ్ అయింది . ఇంతకీ టాక్ ఎలా ఉందో తెలుసా …….. విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయని , అలాగే కథ , కథనం , ఇంటర్వెల్ బ్యాంగ్ , ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని అంటున్నారు . రెహమాన్ అందించిన పాటల కంటే నేపథ్య సంగీతం అదిరిపోయిందని , మరోసారి శంకర్ తన దర్శకత్వ ప్రతిభ తో ఆకట్టుకోవడం ఖాయమని శంకర్ పై అలాగే రజనీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు 2. 0 చిత్రాన్ని చూసిన వాళ్ళు .

550 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు . రజనీకాంత్ హీరో కాబట్టి వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది . గతకొంత కాలంగా రజనీ కి సాలిడ్ హిట్ లేదు అయితే ఆ లోటుని ఈ చిత్రం తీరుస్తుంది అని సెన్సార్ టాక్ . అయితే ఎంత పెద్ద హిట్ అయినా 550 కోట్ల బడ్జెట్ అంటే 1000 కోట్లు వసూల్ చేయగలగాలి . మరి అంత దమ్ము ఈ చిత్రానికి ఉందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . సెన్సార్ టాక్ బాగుంది కాబట్టి భారీ హిట్ కొట్టినా కొట్టొచ్చు . రజనీకాంత్ కు సాలిడ్ హిట్ లేక ఎనిమిది సంవత్సరాలు .

- Advertisement -

English Title: Rajinikanth’s 2.0 censor talk

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All