Homeటాప్ స్టోరీస్భారీ నష్టాలను చవిచూసిన బయ్యర్లు

భారీ నష్టాలను చవిచూసిన బయ్యర్లు

Huge loss for thugs of hindosthan buyersఅమితాబ్ బచ్చన్ , అమీర్ ఖాన్ , కత్రినా కైఫ్ లాంటి స్టార్ లు నటించిన చిత్రం అనడంతో బయ్యర్లు పోటీపడి కొన్నారు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రాన్ని . ఇక బయ్యర్ల దగ్గర నుండి థియేటర్ వాళ్ళు కూడా పోటీ పడి డబ్బులిచ్చి తమ థియేటర్ లలో వేసుకున్నారు . భారీ హిట్ కొడుతుందని ఆశిస్తే భారీ డిజాస్టర్ అయ్యింది దాంతో కళ్ళు బైర్లు కమ్మాయి బయ్యర్లకు , థియేటర్ యజమానులకు . దాంతో మహా ప్రభో మమ్మల్ని ఆదుకోండి అంటూ వేడుకుంటున్నారు . దీపావళి కానుకగా నవంబర్ 8న ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే . అయితే భారీ అంచనాలు ఉండటంతో మొదటిరోజున 50 కోట్ల వసూళ్ల ని సాధించింది కానీ ఆ తర్వాత డిజాస్టర్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో వంద కోట్ల క్లబ్ లో చేరడానికి వారం రోజులు పట్టింది .

ఈ సినిమా రూపొందింది 300 కోట్ల బడ్జెట్ తో అయితే వసూల్ అయ్యింది 150 కోట్లు మాత్రమే అంటే సగం కూడా రాలేదు . మళ్ళీ దీనికి థియేటర్ రెంటల్స్ , ప్రభుత్వ టాక్స్ కలుపుకుంటే వంద కోట్లు కూడా రాబట్టినట్లు కాదు అంటే 200 కోట్ల నష్టం అన్నమాట బయ్యర్లకు , థియేటర్ యజమానులకు . ఇంతపెద్ద మొత్తాన్ని భరించడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి సహాయం చేయండి , మమల్ని అందుకోండి అంటూ చిత్ర నిర్మాతలను వేడుకుంటున్నారట . అమితాబ్ , అమీర్ ఖాన్ లు కూడా బయ్యర్లకు , థియేటర్ యజమానులకు వత్తాసు పలుకుతున్నారు . మరి ఏమౌతుందో చూడాలి . ఇస్తారా ? సహాయం చేస్తారా ?

- Advertisement -

English Title: Huge loss for thugs of hindosthan buyers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All