Homeటాప్ స్టోరీస్ఆ సినిమాపై వివాదం రాజుకుంది

ఆ సినిమాపై వివాదం రాజుకుంది

Controversy on shah rukh khan ZEROబాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం ” జీరో ”. కాగా ఈ సినిమాపై వివాదం రాజుకుంది . ఇంతకీ జీరో సినిమాలో ఉన్న వివాదం ఏంటయ్యా అంటే ……. షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో ఓ సీన్ లో నిక్కర్ వేసుకొని బనియన్ మీద పరుగెత్తు కుంటూ వచ్చే సీన్ వివాదం సృష్టిస్తోంది . షారుఖ్ బనియన్ , నిక్కర్ మీద ఉంటే వివాదం ఏంటి ? అని అనుకుంటున్నారా ? అక్కడే ఉంది మతలబు …… బనియన్ , నిక్కర్ మీద పరుగెత్తుతూ సిక్కులు పవిత్రంగా కొలిచే కిర్పన్ ని పట్టుకున్నాడు . ఇంకేముంది సిక్కుల మనోభావాలను కించపరిచారు అంటూ వివాదం మొదలు పెట్టారు .

గతకొంత కాలంగా షారుఖ్ ఖాన్ వరుస పరాజయాలతో ఘోరంగా దెబ్బ తింటున్నాడు . ఖాన్ త్రయం లో మిగతా ఇద్దరు సల్మాన్ ఖాన్ ఒకింత ఇబ్బంది పడుతున్నప్పటికీ హిట్ , ప్లాప్ లతో రేసులోనే ఉన్నాడు . ఇక అమీర్ ఖాన్ జోరు మాములుగా లేదు దశాబ్దం కు పైగా వరుస హిట్స్ తో దూసుకుపోయిన అమీర్ ఖాన్ కు తాజాగా పెద్ద ఝలక్ పడింది థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంతో . అయితే సల్మాన్ ఖాన్ కానీ అమీర్ ఖాన్ కానీ ప్లాప్ లు తక్కువగా తిన్నారు కానీ షారుఖ్ మాత్రం హిట్ మొహం చూడక చాలారోజులయ్యింది . దాంతో ఈ జీరో పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కట్ చేస్తే ఇది వివాదాస్పదం అయ్యింది అయితే ఈ వివాదం హిట్ కు దారి చూపిస్తుందా ? లేక ఇబ్బంది పెడుతుందా ? చూడాలి .

- Advertisement -

English Title: Controversy on shah rukh khan ZERO

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All