Homeన్యూస్శివ కథ చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదు - రజినీకాంత్

శివ కథ చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదు – రజినీకాంత్

శివ కథ చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదు - రజినీకాంత్
శివ కథ చెబుతుంటే కన్నీళ్లు ఆగలేదు – రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ అన్నాత్తేతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం తమిళ్ లో రికార్డులను తిరగరాస్తోంది. తెలుగు వెర్షన్ అడ్రస్ లేకుండా పోయింది, అది వేరే విషయం. అన్నాత్తే సక్సెస్ పట్ల రజినీకాంత్ సూపర్ హ్యాపీగా ఉన్నాడు. రీసెంట్ గా హోటే యాప్ లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తన కూతురు సౌందర్య రజినీకాంత్ ఆధ్వర్యంలో తయారైన ఈ యాప్ కు రజినీ పబ్లిసిటీ చేస్తున్నాడు.

ఆ యాప్ లో వాయిస్ నోట్ ద్వారా మాట్లాడుతూ, “నా గత సినిమా పెట్టా, విశ్వాసం ఒకే సమయంలో విడుదలయ్యాయి. రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. నేను విశ్వాసం నిర్మాతను కాంటాక్ట్ చేసి స్పెషల్ స్క్రీనింగ్ వేయమని అడిగాను. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపూ ఈ చిత్రంలో అంత స్పెషల్ గా ఏముందా, ఇంత సూపర్ హిట్ అయింది అనుకున్నాను, అయితే చివరికి వచ్చే సరికి చిత్రం కొత్త యాంగిల్ తో నన్ను ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

స్క్రీనింగ్ పూర్తయ్యాక నేను నాకు తెలీకుండానే చప్పట్లు కొట్టేసాను. ఆ తర్వాత ఆ నిర్మాతగా దర్శకుడు శివతో మాటాడాలని చెప్పాను. శివతో మొదటి సారి మాట్లాడినప్పుడే నాకు బాగా కనెక్ట్ అయ్యాడు. నీ వద్ద ఏదైనా కథ ఉందా? సినిమా చేద్దాం అని అడిగాను. మీతో సూపర్ హిట్ తీయడం చాలా ఈజీ సార్ అని అన్నాడు. నాతో ఇలా ఏ దర్శకుడూ చెప్పలేదు. శివ కాన్ఫిడెన్స్ నచ్చింది. కేవలం 20 రోజుల్లో అన్నాత్తే స్క్రిప్ట్ రెడీ చేసాడు. రెండు గంటలకు పైగా నరేషన్ ఇచ్చాడు. నరేషన్ ఇస్తుంటే నాకు తెలీకుండా కన్నీళ్లు వచ్చేసాయి” అని రజినీ షేర్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి:

రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉంది: వైద్యులు

రెండుగా చీలిన రజినీకాంత్ అభిమానులు

రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All