Homeటాప్ స్టోరీస్రెండుగా చీలిన రజినీకాంత్ అభిమానులు

రెండుగా చీలిన రజినీకాంత్ అభిమానులు

రెండుగా చీలిన రజినీకాంత్ అభిమానులు
రెండుగా చీలిన రజినీకాంత్ అభిమానులు

సినిమా వేరు,రాజకీయం వేరు. సినిమా అనేది పూర్తిగా కల్పితం; అదేవిధంగా రాజకీయాలు పూర్తిగా వాస్తవం. సినిమాల పరంగా తమ హీరో ఎలా ఉన్నా, హిట్టు ,ఫ్లాపులతో సంబంధం లేకుండా అభిమానించే ఫ్యాన్స్, రాజకీయాల విషయంలో మాత్రం హీరోలను ఆదేసుకుంటారు. ఎందుకంటే ఒక హీరోగా నటుడు అభిమానులకు ఏమీ ఇవ్వక్కరలేదు. ఒక మంచి సినిమా చేసి ఇస్తే చాలు. కానీ, రాజకీయంలోకి వచ్చాక ప్రతి విషయంలో సరైన విధానంతో లేకపోతే లేదా ఎదో ఒక పక్షం వైపు నిలబడితే మిగిలిన వర్గాల వారందరూ దుమ్మెత్తిపోస్తారు.

ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో కూడా అలాగే జరుగుతోంది. పౌరసత్వ సవరణ బిల్లు కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొంతమంది చేస్తున్న గొడవలు హింసాత్మక చర్యలకు లోనవుతున్నాయి. దీనిపట్ల రజినీకాంత్ స్పందిస్తూ, “దేశవ్యాప్తంగా జరుగుతున్న గొడవలు నన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ సమస్యకు అయినా అల్లర్లు పరిష్కారం కాదు.భారతీయులు అంతా ఐకమత్యంగా ఉండాలి. దేశ భద్రత విషయం దృష్టిలో పెట్టుకుని అంతా అప్రమత్తంగా ఉండాలి.” అని అన్నారు. అయితే దీనిపట్ల రజినీ అభిమానులు రెండుగా విడిపోయారు. CAB బిల్లుకు అనుకూలంగా కొంతమంది; ప్రతికూలంగా కొంతమంది చొప్పున విడిపోయి షేమ్ ఆన్ సంగి రజినీ అని; ఐ యాం విత్ రజినీకాంత్ అని హాష్ ట్యాగ్స్ చేస్తూ డిజిటల్ వార్ చేసుకుంటున్నారు. వీళ్ళలో రజినీకాంత్ కి అనుకూలంగా మాట్లాడే వారి సంఖ్య అధికంగా ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All