Homeగాసిప్స్రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా

రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా

రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా
రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా

రజినీకాంత్… ఈ పేరుకి అభిమానంతో ఊగిపోయే జనాలు కోట్లల్లో ఉన్నారు. కేవలం ఒక భాషకు పరిమితం చేయగల నటుడు కాదు రజినీకాంత్ అంటే. ఆయన పేరు మీద వందల కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించాడు రజిని. తెలుగులో కూడా ఈ సూపర్ స్టార్ ఫాలోయింగ్ కు కొదవేం లేదు. ఇక్కడ స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ రజిని సొంతం. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం రజినీకాంత్ కు క్రేజ్ లేదు. కనీసం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి ఉంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇదే నిజం. రజినీకాంత్ సినిమాలు ఇప్పుడు తెలుగులో ఆడటం లేదు. గత చరిత్ర వైభవం చెప్పుకుని విడుదల చేసుకోవాల్సిందే కానీ రజినీకాంత్ కు తెలుగులో హిట్ వచ్చి చాలా కాలమైంది. శంకర్ – రజినీకాంత్ క్రేజ్ వల్ల రోబో ఆడింది. రోబో, చంద్రముఖి వంటి సినిమాల తర్వాత రజినీకి ఇక్కడ హిట్ లేదు. అయినా ఇన్నాళ్లూ ఆయన సినిమాలకు బాగానే బిజినెస్ జరిగేది. ఇప్పుడు అది కూడా లేదు.

రజినీకాంత్ రోబో 2.0 కి రోబో, శంకర్ కాంబినేషన్ వల్ల క్రేజ్ బాగానే వచ్చింది. అయితే ఆ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు వర్కౌట్ కాలేదు. దీనికంటే ముందు వచ్చిన కబాలి తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపించింది. మళ్ళీ అదే దర్శకుడికి అవకాశం ఇచ్చి కాలా తీస్తే అది కూడా ఇంచుమించు అలాంటి ఫలితాన్నే అందుకుంది. బయ్యర్లు ఈ సినిమాలతో భారీ నష్టాలను చూసారు. దీంతో రజినీకి క్రేజ్ తగ్గడం మొదలైంది. అందుకే పేట సినిమాను చాలా తక్కువ ధరకు తెలుగులో విక్రయించారు. అయినా కానీ పేట ఇక్కడ నష్టాలనే అందుకుంది. దీనివల్ల బయ్యర్లలో కూడా కనువిప్పు కలిగింది. ప్రేక్షకులు ఇదివరకటిలా రజినిని తెరపై చూడటానికి ఎగబడిపోవట్లేదని తెలుసుకున్నారు. అందుకే రజినీకాంత్ తాజా చిత్రం దర్బార్ కు ఊహించినంత హంగామా లేదు.

- Advertisement -

ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావట్లేదు. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. వైజాగ్, నైజాం వరకూ దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకుంటారు. మిగిలిన ఏరియాల్లో హక్కులు అమ్మడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం దిల్ రాజును అయోమయానికి గురి చేస్తోంది. రజినీ క్రేజ్ తగ్గడం ఒక కారణమైతే, పోటీగా రెండు పెద్ద సినిమాలు బరిలో ఉండడం అసలు కారణం. సంక్రాంతికి విడుదల కానున్న దర్బార్ కు పోటీగా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బరిలో ఉన్నాయి. సంక్రాంతికి ఈ రెండు సినిమాల మీదే ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. ఈ రెండు సినిమాలను చూసిన తర్వాతే ప్రేక్షకుడు ఈ సీజన్ లో మరో సినిమా చూడాలనుకుంటారు. అందుకే పోటీ ఉండకూడదని జనవరి 9కి దర్బార్ రిలీజ్ మార్చారు. అయినా ఆ రెండు రోజులే దర్బార్ కు కలెక్షన్స్ ఉంటాయి. తర్వాత దృష్టాంతా రెండు పెద్ద సినిమాలపైనే ఉంటుంది. అందుకె రజినీ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All