HomeVideosపెళ్లి సందD గంధర్వ లోకాల వీడియో సాంగ్: రాఘవేంద్ర రావు స్టైల్ మేకింగ్

పెళ్లి సందD గంధర్వ లోకాల వీడియో సాంగ్: రాఘవేంద్ర రావు స్టైల్ మేకింగ్

పెళ్లి సందD గంధర్వ లోకాల వీడియో సాంగ్: రాఘవేంద్ర రావు స్టైల్ మేకింగ్
పెళ్లి సందD గంధర్వ లోకాల వీడియో సాంగ్: రాఘవేంద్ర రావు స్టైల్ మేకింగ్

నిర్మల కాన్వెంట్ చిత్రంతో డెబ్యూ చేసిన రోషన్ కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. లెజెండరీ దర్శకుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందD చిత్రం ఈ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కాబోతోంది. ఇప్పటికే పాటలు, ప్రోమోలు ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు నిర్మాతలు ఈ చిత్రం నుండి గంధర్వ లోకాల వీడియో సాంగ్ ను విడుదల చేసారు.

ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఈ పాట మంచి కలర్ఫుల్ రొమాంటిక్ డ్యూయట్ లా అనిపిస్తోంది. వీడియో సాంగ్ మొత్తం రాఘవేంద్ర రావు మార్క్ కనిపిస్తోంది. మొత్తం కలర్ఫుల్ గా పూలు, లైటింగ్ తో నిండిపోయింది. అలాగే హీరోయిన్ నడుమందాలను భలే అందంగా ప్రాజెక్ట్ చేసారు.

- Advertisement -

ఒక టిపికల్ రాఘవేంద్ర రావు రొమాంటిక్ సాంగ్ ను చూస్తోన్న భావనను తీసుకురాగలిగారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. దర్శకత్వ పర్యవేక్షణతో పాటు ఈ చిత్రంలో నటిస్తున్నాడు రాఘవేంద్ర రావు. నటుడిగా ఇదే ఆయన తొలి చిత్రం. ఆర్కా మీడియా వర్క్స్ తో పాటు ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాతికేళ్ల క్రితం తండ్రికి పెళ్లి సందడి చిత్రంతో సూపర్ డూపర్ హిట్ దక్కింది. మరి ఇప్పుడు కొడుక్కి అదే టైటిల్ తో వస్తుండగా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All