HomeVideosకొండ పొలం ట్రైలర్: వైష్ణవ్ మరోసారి కొట్టేలా ఉన్నాడుగా!

కొండ పొలం ట్రైలర్: వైష్ణవ్ మరోసారి కొట్టేలా ఉన్నాడుగా!

కొండ పొలం ట్రైలర్: వైష్ణవ్ మరోసారి కొట్టేలా ఉన్నాడుగా!
కొండ పొలం ట్రైలర్: వైష్ణవ్ మరోసారి కొట్టేలా ఉన్నాడుగా!

ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే రికార్డులను జేబులు పెట్టేసుకున్న వైష్ణవ్ చడీచప్పుడు లేకుండా గతేడాదే కొండ పొలం అనే చిత్రాన్ని పూర్తి చేసాడు. సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన కొండ పొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  వివిధ కారణాల వల్ల విడుదలలో జాప్యం జరిగింది.

అయితే మొత్తానికి అక్టోబర్ 8న కొండ పొలం విడుదల కానున్నట్లు అధికారికంగా తెలియజేసారు. ఇక కొద్దిసేపటి క్రితం కొండ పొలం ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. నల్లమల అటవీ ప్రాంతంలో కొండ పొలం అనే మన్యం ప్రాంతంలో జరిగే కథ ఇది. గొర్రెల కాపరుల జీవన విధానం, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ప్రధానంగా ఈ చిత్రం ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

- Advertisement -

మన్యం ప్రాంతంలో పుట్టి పెరిగి ఉద్యోగాల వేటలో అలిసిపోయి కుర్రాడిగా వైష్ణవ్ తేజ్ నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా అడవిలో పులికు సంబంధించిన ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో స్పెషల్ అట్రాక్షన్. మొత్తంగా కొండ పొలం ట్రైలర్ భిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All