Homeటాప్ స్టోరీస్ఆ చిత్రాన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేసి తప్పు చేసారు

ఆ చిత్రాన్ని ఓవర్సీస్ లో రిలీజ్ చేసి తప్పు చేసారు

Disaster talk to veera bhoga vasantha rayalu in overseasనారా రోహిత్ , శ్రియా శరన్ , సుధీర్ బాబు , శ్రీ విష్ణు లు కీలక పాత్రలు పోషించిన చిత్రం ” వీర భోగ వసంత రాయలు ”. ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 26 న విడుదల అవుతోంది అయితే తొందరపడి ఓవర్ సీస్ లో రెండు రోజుల ముందుగానే విడుదల చేసారు . సినిమా బాగుంటే , ప్రేక్షకులను అలరించే అంశాలు ఉంటే ముందుగా రిలీజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కానీ సినిమా ఏమాత్రం బాగోలేకపోయినా తీవ్రంగా దెబ్బ పడుతుంది . ఇప్పుడు వీర భోగ వసంత రాయలు చిత్రం విషయంలో అదే జరిగింది . ఓవర్ సీస్ లో విడుదలైన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది . అంటే ఎల్లుండి రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అవుతున్న నేపథ్యంలో తప్పకుండా ఇబ్బందులు తప్పకపోవచ్చు .

ఆల్రెడీ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా అందునా పెద్దగా పేరు , ఇమేజ్ లేని నటీనటులు నటించిన సినిమా కావడంతో వీర భోగ వసంతరాయలు చిత్రాన్ని పట్టించుకునే నాధుడే ఉండడు . ఇలా తొందరపడి విడుదల చేసి
చాలా పెద్ద తప్పు చేసారు ఆ చిత్ర బృందం . ఓవర్ సీస్ లో ఈ చిత్రాన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు , ఇక సినిమా కూడా చాలా ఘోరంగా ఉందట . మంచి లైన్ ని ఎంచుకున్నప్పటికీ దాన్ని సరిగ్గా స్క్రీన్ ప్లే పరంగా చూపించడంలో దర్శకుడు ఘోరంగా విఫలమయ్యాడట. ఓవర్ సీస్ టాక్ ఘోరంగా ఉంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో వీర భోగ వసంతరాయలు కి విడుదలలో చాలా ఇబ్బందులు తప్పకపోవచ్చు .

- Advertisement -

English Title: Disaster talk to veera bhoga vasantha rayalu in overseas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All