Homeటాప్ స్టోరీస్నారా రోహిత్ ఇంకా ఎన్నాళ్ళు

నారా రోహిత్ ఇంకా ఎన్నాళ్ళు

nara rohit should learn of his career నారా రోహిత్ హీరోగా పరిచయమై అప్పుడే తొమ్మిదేళ్లు పూర్తయ్యింది , ఇప్పటి వరకు చేసింది 21 సినిమాలు కాగా అందులో 16 సినిమాలు విడుదల అయ్యాయి కానీ హిట్స్ మాత్రం మూడే ! ఈ హీరో నటించిన సినిమాలు 16 రిలీజ్ అయ్యాయా ? అని ఆశ్చర్యపోవడం ఖాయం ఎందుకంటే కొన్ని సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యాయో ! ఏ సినిమా ఎప్పుడు వస్తుందో సరిగ్గా తేలీదు ఎందుకంటే ఒక్కోసారి వరుసపెట్టి సినిమాలు విడుదల అయ్యాయి మరి . తాజాగా ఈ నారా రోహిత్ నటించిన ” ఆటగాళ్లు ” విడుదల అవుతోంది రేపు . ఇందులో కీలక పాత్రలో జగపతిబాబు కూడా నటించాడు .

జయాపజయాలకు సంబంధం లేకుండా చాలా చిత్రాలు చేసున్నాడు నారా రోహిత్ అవి విడుదల అవుతున్నాయి కానీ హిట్ అంటే మాత్రం ఆమడదూరం పారిపోతున్నాయి . సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది కానీ ఇలా ఎన్ని సినిమాలు డింకీ లు కొడుతున్నా నారా రోహిత్ మాత్రం యధాలాపంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు తప్ప జాగ్రత్తలు తీసుకోవడం లేదు . అతడితో సినిమాలు తీయడానికి పలువురు పోటీ పడుతున్నారంటే ఇప్పటకైనా జాగ్రత్తలు తీసుకొంటే తప్పకుండా హీరో గా నిలబడతాడు లేదంటే షరా మామూలే !

- Advertisement -

English Title: nara rohit should learn of his career

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All