Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ కు లైన్ క్లియర్ అయినట్లే !

అల్లు అర్జున్ కు లైన్ క్లియర్ అయినట్లే !

Allu arjun next with trivikramనాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ఘోర పరాజయం పొందడంతో ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి భయపడ్డాడు అల్లు అర్జున్ . అందుకే గత ఆరు నెలలుగా కొత్త సినిమా ఏది కూడా ప్రకటించలేదు . మేలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదలై ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . ఇక అప్పటి నుండి ఫలానా దర్శకుడితో సినిమా అంటే ఫలానా దర్శకుడితో సినిమా అంటూ కథనాలు వస్తున్నాయ్ తప్ప ఏ ఒక్క దర్శకుడికి కూడా ఓకే చెప్పలేదు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కోసం కాచుకు కూర్చున్నాడు ఎందుకంటే అరవింద సమేత హిట్ అయితే అతడితో సినిమా చేయొచ్చని .

ఇంకేముంది నిన్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అయ్యింది , సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది దాంతో అల్లు అర్జున్ నిరీక్షణ ఫలించింది . తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ . ఇంతకుముందు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ” జులాయి ” , సన్నాఫ్ సత్యమూర్తి ” చిత్రాలు వచ్చాయి . ఆ రెండు కూడా హిట్స్ కావడంతో ఇప్పుడు హ్యాట్రిక్ కోసం చేయి చేయి కలుపుతున్నారు . త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ కోసం ఓ లైన్ రెడీ చేసాడట . ఇక త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారట కొత్త సినిమా గురించి .

- Advertisement -

English Title: Allu arjun next with trivikram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All