Homeటాప్ స్టోరీస్మహేష్ ని త్రివిక్రమ్ లైట్ గా తీసుకున్నాడా

మహేష్ ని త్రివిక్రమ్ లైట్ గా తీసుకున్నాడా

trivikram mahesh movie in dilemmaమహేష్ బాబు తో త్రివిక్రమ్ అతడు , ఖలేజా వంటి చిత్రాలను అందించాడు . అతడు మంచి హిట్ కాగా ఖలేజా ప్లాప్ అయ్యింది . దాని తర్వాత మళ్ళీ ఓ సినిమా మహేష్ బాబు తో చేద్దామనుకున్నాడు త్రివిక్రమ్ , ఇక మహేష్ కూడా త్రివిక్రమ్ మళ్ళీ సినిమా చేయాలనీ అనుకున్నాడు కానీ ఇంతవరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ కాలేదు . ఒకవైపు మహేష్ బాబు ఇతర దర్శకులతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు అలాగే త్రివిక్రమ్ కూడా ఇతర హీరోలతో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు .

తాజాగా మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా చేసున్నాడు దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమాని చేయడానికి రెడీ అవుతున్నాడు అంటే ఓ రెండేళ్ల వరకు ఖాళీ లేదన్న మాట ! ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే …… ప్రస్తుతం ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నాడు . దాని తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . అంటే ఇప్పట్లో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా లేనట్లే ! అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఎవరిని వదిలేసినట్లో !

- Advertisement -

English Title: trivikram mahesh movie in dilemma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All