Homeటాప్ స్టోరీస్డిజాస్టర్ దిశగా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా

డిజాస్టర్ దిశగా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా

allu arjuns naa peru surya naa illu india towards disasterఅల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది . మే 4న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజునే డివైడ్ టాక్ వచ్చింది అయితే అల్లు అర్జున్ కున్న క్రేజ్ తో ఓపెనింగ్స్ రాబట్టింది . రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ కు మంచి ఇమేజ్ ఉంది కాబట్టి కాస్తో కూస్తో కలెక్షన్లు వస్తున్నాయి కానీ బిజినెస్ జరిగింది 80 కోట్లు . అంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని కొనుక్కున్న బయ్యర్ల కు లాభాలు రాకపోయినా ఫరవాలేదు కానీ నష్టాలు రాకుండా ఉండాలంటే 140 కోట్లకు పైగా వసూల్ కావాలి .

కానీ ఇప్పటి వరకు నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా కనీసం వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని కూడా రాబట్టలేకపోయింది . ఓవర్ సీస్ లో అయితే అప్పుడే డిజాస్టర్ అయిపొయింది అలాగే మలయాళంలో అల్లు అర్జున్ కు విపరీతమైన డిమాండ్ ఉంది కానీ అక్కడ కూడా డిజాస్టర్ అయ్యింది . తెలుగులో పరిస్థితి కూడా అంతే ! అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ సినిమా విడుదలయ్యాక చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది దాంతో అల్లు అర్జున్ ఆశలన్నీ అడియాసలయ్యాయి . వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొత్తంగా బయ్యర్లకు చుక్కలు చూబెడుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All