Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ హిట్ కోసం ప్రార్థిస్తున్న అల్లు అర్జున్

ఎన్టీఆర్ హిట్ కోసం ప్రార్థిస్తున్న అల్లు అర్జున్

Aravinda sametha veera raghava :Allu arjun praying for hitఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం హిట్ కావాలని ప్రార్దిస్తున్నాడు అల్లు అర్జున్ . అదేంటో ఎన్టీఆర్ సినిమా హిట్ కోసం అల్లు అర్జున్ ప్రార్ధించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? త్రివిక్రమ్ కోసం . అవును త్రివిక్రమ్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయాలనీ ఉత్సాహపడుతున్నాడు అల్లు అర్జున్ , దాంతో అరవింద సమేత వీర రాఘవ హిట్ అయితే తన సినిమాకు లైన్ క్లియర్ అవుతుంది కాబట్టి అప్పుడు త్రివిక్రమ్ తో హాయిగా సినిమా చేసుకోవచ్చని భావిస్తున్నాడట అల్లు అర్జున్ .

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రం డిజాస్టర్ కావడంతో అప్పటినుండి మరో సినిమా ఏది చేయకుండా ఖాళీగా ఉన్నాడు అల్లు అర్జున్ . విక్రమ్ కుమార్ తో అలాగే ఇతర దర్శకులతో సినిమా చేయాలనీ కథలు వింటున్నాడు కానీ ఏది కూడా సెట్ కాలేదు . ఇక మారుతి కూడా కథ చెప్పడానికి రెడీ అయ్యాడు కానీ వాళ్ళు చెబుతున్న కథలు పక్కాగా స్క్రిప్ట్ రూపొందడంలో మాత్రం కుదరడం లేదు దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని ఉత్సాహపడుతున్నాడు అల్లు అర్జున్ . ఇప్పటివరకు అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి అవి హిట్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఎన్టీఆర్ అరవింద హిట్ కోసం .

- Advertisement -

English Title: Aravinda sametha veera raghava :Allu arjun praying for hit

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All