Homeటాప్ స్టోరీస్అరవింద సమేత ఓవర్సీస్ ప్రీమియర్ షో కలెక్షన్లు

అరవింద సమేత ఓవర్సీస్ ప్రీమియర్ షో కలెక్షన్లు

NTR's Aravinda sametha overseas premier shows collectionsఅరవింద సమేత వీర రాఘవ చిత్రంతో ఓవర్సీస్ లో ఎన్టీఆర్ సత్తా చాటాడు . కేవలం ప్రీమియర్ షోలతోనే 7. 91లక్షల డాలర్లను (5 కోట్ల 85 లక్షలను )వసూల్ చేసాడు ఎన్టీఆర్ . నిన్న రిలీజ్ అయిన అరవింద సమేత చిత్రానికి అక్కడ పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది దాంతో అవలీలగా మూడు మిలియన్ డాలర్ల ని చేదించడం ఖాయమని అంటున్నారు . ఇక తాజాగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ అరవింద సమేత చిత్రం అమెరికాలో ప్రీమియర్ షోలతో వసూల్ చేసిన మొత్తాన్ని ట్వీట్ చేసాడు . ప్రారంభం అదిరిందని , వారం మధ్యలోనే ఇంత బాగా వసూల్ చేస్తే వీకెండ్ లో మరింతగా అదరగొట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

ఓవర్సీస్ లో మొత్తం 218 లోకేషన్లలో అరవింద సమేత చిత్రం రిలీజ్ అయ్యింది . ఎన్టీఆర్ కు ఓవర్సీస్ లో వసూళ్ళ పరంగా నెంబర్ వన్ చిత్రంగా నిలవడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకేక్కినప్పటికి , ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండటంతో ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు . ఎన్టీఆర్ నటన త్రివిక్రమ్ డైరెక్షన్ వెరసి అరవింద సమేత ని పెద్ద హిట్ ని చేసాయి . ఓవర్ సీస్ లో ఇప్పుడు ఎన్టీఆర్ త్రీ మిలియన్ డాలర్ల పై కన్నేశాడు .

- Advertisement -

English Title: NTR’s Aravinda sametha overseas premier shows collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All