Homeటాప్ స్టోరీస్తెలంగాణలో దుమ్మురేపిన ఎన్టీఆర్

తెలంగాణలో దుమ్మురేపిన ఎన్టీఆర్

Ntr creates new trend in telangana with aravinda samethaయంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణలో దుమ్ము రేపాడు వసూళ్ళ పరంగా . ఒక్కరోజులోనే తెలంగాణలో 6 కోట్ల వసూళ్ళ ని మూటగట్టుకున్నాడు ఎన్టీఆర్ . నిన్న భారీ ఎత్తున విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి నీరాజనం పడుతున్నారు నందమూరి అభిమానులు ప్రేక్షక దేవుళ్ళు దాంతో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసాడు ఎన్టీఆర్ . తెలంగాణలో బాహుబలి ,బాహుబలి 2 చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం నిలిచింది అత్యధిక వసూళ్లతో . ఎన్టీఆర్ మాస్ హీరో దానికి తోడూ దసరా సెలవులు కూడా తోడవ్వడంతో ఈ భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి .

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మిగతా చిత్రాలకు కాస్త భిన్నంగా వచ్చింది దాంతో మహిళా ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పడుతున్నారు అరవింద సమేత చిత్రానికి . నైజాం సినిమా మార్కెట్ కు చాలా కీలకం అన్న విషయం తెలిసిందే . మొదటి రోజునే ఆరు కోట్ల వసూళ్లు అంటే మిగతా ఆరు రోజుల్లో బీభత్సమే సృష్టించడం ఖాయమని అంటున్నారు . తెలంగాణలో ఈ సినిమాని దిల్ రాజు విడుదల చేసాడు . వరుస పరాజయాల నేపథ్యంలో అరవింద సమేత చిత్రం లాభాలు తెచ్చిపెడుతున్డటంతో చాలా సంతోషంగా ఉన్నాడు దిల్ రాజు .

- Advertisement -

English Title: Ntr creates new trend in telangana with aravinda sametha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All