Homeటాప్ స్టోరీస్అరవింద సమేత రివ్యూ

అరవింద సమేత రివ్యూ

aravinda sametha movie review
అరవింద సమేత రివ్యూ
అరవింద సమేత రివ్యూ :
నటీనటులు : ఎన్టీఆర్ , పూజా హెగ్డే , జగపతిబాబు , నాగబాబు
సంగీతం : ఎస్ ఎస్ తమన్
నిర్మాత : ఎస్ . రాధాకృష్ణ
దర్శకత్వం : త్రివిక్రమ్
రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018
రేటింగ్ : 3.5/5

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా ? అని ఆశగా ఎదురు చూసిన నందమూరి అభిమానుల కోరిక తీరేలా ఎట్టకేలకు అరవింద సమేత చిత్రం రూపొందింది . దసరా సెలవుల మద్య విడుదలైన ఈ భారీ చిత్రం పై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . మరి ఆ అంచనాలను అరవింద సమేత అందుకుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .

కథ :

- Advertisement -

ఫ్యాక్షన్ కుటుంబానికి దూరంగా ఉంటూ సరదాగా ఉండే వ్యక్తీ వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్ ) . అయితే రాయలసీమలో మాత్రం బాసిరెడ్డి ( జగపతిబాబు ) నారప రెడ్డి ( నాగబాబు ) లు రెండు వర్గాలుగా కత్తులు దూసుకుంటూ రక్తపాతం సృష్టిస్తుంటారు . అరవింద (పూజా హెగ్డే ) ని ప్రేమించిన వీర రాఘవ రెడ్డి ఆమెకు ఇచ్చిన మాట కోసం బాసిరెడ్డి – నారప రెడ్డి ల మద్య వైరం తగ్గించడానికి పూనుకుంటాడు . అసలు బాసిరెడ్డి , నారప రెడ్డి లు ఎవరు ? అరవింద కోసం వీర రాఘవ రెడ్డి ఏం చేసాడు ? రాయలసీమ ఫ్యాక్షనిజం వల్ల బలైన మహిళల జీవితం ఎలా ఉంది ? అసలు వీర రాఘవ రెడ్డి కి ఈ ఫ్యాక్షన్ తో ఉన్న సంబంధం ఏంటి ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ఎన్టీఆర్
ఎమోషనల్ సీన్స్
క్లైమాక్స్

డ్రా బ్యాక్స్ :

ఎంటర్ టైన్ మెంట్
సునీల్ పాత్ర
ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు
రొటీన్ కథ

నటీనటులు :

వీర రాఘవ రెడ్డి పాత్రలో ఎన్టీఆర్ నటన అసామాన్యం అనే చెప్పాలి . ఫస్టాఫ్ లో ఒక రకంగా సెకండాఫ్ లో మరో రకంగా విభిన్నమైన వేరియేషన్స్ చూపించాడు . ఎన్టీఆర్ డైలాగ్స్ , నటన ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది . ఎన్టీఆర్ ఇంతకుముందు రాయలసీమ ఫ్యాక్షన్ చిత్రాల్లో నటించ్నప్పటికి వాటికీ ఈ అరవింద సమేత చిత్రానికి చాలా తేడా ఉంది . పూజా హెగ్డే కు మంచి పాత్ర లభించింది , ఇక ఆ పాత్రని సద్వినియోగం చేసుకుంది కూడా . విలన్ గా జగపతిబాబు కి మరోసారి చాలెంజింగ్ పాత్ర లభించింది దాంతో మరోసారి సత్తా చాటాడు . అద్భతమైన విలనిజాన్ని పండించాడు జగపతిబాబు . కొంత కాలంగా జగపతి బాబుకి పరమ రొటీన్ పాత్రలు లభిస్తున్నాయి కానీ వాటికీ భిన్నంగా అరవింద లో పవర్ ఫుల్ విలన్ పాత్ర లభించింది . సునీల్ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ అంతగా ఆకట్టుకోలేక పోయాడు . ఈశా రెబ్బా కు అంతగా ప్రాధాన్యత లేని పాత్ర లభించింది . ఇక మిగిలిన పాత్రల్లో నాగబాబు , సితార , దేవయాని , సుప్రియ పతక్ లు తమతమ పాత్రలకు పూర్తీ న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

ఈ చిత్రానికి పీఎస్ వినోద్ అందించిన ఛాయాగ్రహణం హైలెట్ గా నిలిచింది . భారీ విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి . యాక్షన్ దృశ్యాల్లో వినోద్ కెమెరా పనితనం చాలా బాగుంది . ఎస్ ఎస్ తమన్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఈ చిత్రానికి హైలెట్ అనే చెప్పాలి . అందుకేనేమో ఎన్టీఆర్ తమన్ ని అంతగా పొగిడాడు . పాటలు విజువల్ గా బాగున్నాయి . రాధాకృష్ణ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది , భారీ గా ఖర్చు పెట్టి నిర్మించాడు . ఇక దర్శకులు త్రివిక్రమ్ విషయానికి వస్తే …… రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా ని ఎంచుకున్నప్పటికీ బలీయైన సెంటిమెంట్ ని హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు . అజ్ఞాతవాసి చిత్రంతో డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్ రాయలసీమ ఫ్యాక్షన్ ని కథగా ఎంచుకొని ఫ్యాక్షన్ బారిన పడిన వ్యక్తుల కుటుంబాలు , అందునా మహిళలు ఎలాంట్ బాధని అనుభవిస్తునారు అని చెప్పడంలో విజయం సాధించాడు . ఇక ఎన్టీఆర్ చేత చెప్పించిన డైలాగ్స్ కి అదరహో అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .

ఓవరాల్ గా :

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా మిగతావాళ్ళని కూడా అలరించడం ఖాయం . పైగా దసరా సెలవులు కాబట్టి వసూళ్లు కూడా కుమ్మేయడం ఖాయం . భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళితే తప్పకుండా అరవింద నచ్చుతుంది .

English Title: aravinda sametha movie review

                                        Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All