Homeటాప్ స్టోరీస్జగన్ స్పూర్తితో యాత్ర 2 చేస్తాడట

జగన్ స్పూర్తితో యాత్ర 2 చేస్తాడట

 

- Advertisement -

కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర స్పూర్తితో యాత్ర చిత్రం చేసాడు దర్శకులు మహి వి రాఘవ . యాత్ర సినిమా సూపర్ హిట్ కాకపోయినా మంచి హిట్ అయ్యింది అలాగే అంతకంటే మంచి పేరు తెచ్చిపెట్టింది అందునా వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఎన్నికల సమయంలో బాగా ఉపయోగపడింది కూడా . కట్ చేస్తే జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతుండటంతో యాత్ర 2 చిత్రం చేస్తానని ప్రకటించాడు దర్శకులు మహి వి రాఘవ .

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన యాత్ర తో మహి కి మంచి పేరొచ్చింది దాంతో ఇప్పుడు జగన్ పాదయాత్ర స్పూర్తితో యాత్ర 2 చేయనున్నట్లు ప్రకటించాడు . జగన్ ముఖ్యమంత్రి అవుతోంది ఇప్పుడే కాబట్టి కొంతకాలం తర్వాత యాత్ర 2 సెట్స్ మీదకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది . ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు లాంటి ఉద్దండ నాయకుడ్ని మట్టికరిపించి అఖండ విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All