Homeటాప్ స్టోరీస్యాత్ర వర్మ కు బాగా నచ్చిందట

యాత్ర వర్మ కు బాగా నచ్చిందట

Director Ram Gopal Varma review on Yatraఎన్టీఆర్ బయోపిక్ బాగోలేదని , బాలయ్య మాత్రమే కనిపించాడని ఎన్టీఆర్ కనిపించలేదని ఘాటుగా విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ తాజాగా రిలీజ్ అయిన యాత్ర చిత్రం పై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నాడు . యాత్ర చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించావని దర్శకులు మహి వి రాఘవ ని అభినందించిన వర్మ మమ్ముట్టి తన సహజ నటనతో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేసాడని ప్రశంసలు కురిపించాడు .

 

- Advertisement -

ఫిబ్రవరి 8 న విడుదలైన యాత్ర చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది . మంచి వసూళ్ల ని కూడా సాధిస్తోంది యాత్ర . ఇక సినిమారంగంలో కూడా యాత్ర పట్ల ప్రశంసలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేసాడని కొనియాడుతున్నారు . ఎన్టీఆర్ బయోపిక్ కు వ్యతిరేకంగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All