Homeటాప్ స్టోరీస్హీరోయిన్ ని భయపెట్టిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్

హీరోయిన్ ని భయపెట్టిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్

vijay devarakonda fans insults priyanka jawalkarటాక్సీ వాలా చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన భామ ప్రియాంక జవాల్కర్ ని భయపెట్టారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . నిన్న టాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే . ఆ వేడుకలో పాల్గొన్న ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ అంటే పడి చచ్చిపోతానని అందరి ముందు చెప్పేసింది . అల్లు అర్జున్ ని చూడగానే పడిపోయానని , గీతా ఆర్ట్స్ ఆఫీసులో మిమ్మల్ని చూశానని , అప్పటి నుండి మీరంటే క్రష్ అంటూ అసలు విషయాన్నీ చెప్పేసింది . అయితే అదే సమయంలో ఇంకా సినిమాకు సంబందించిన పలు విషయాలు చెప్పబోతుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గోల గోల చేసారు దాంతో భయపడిపోయింది పాపం ! ప్రియాంక . అయితే అప్పటికి కాస్త ధైర్యం తెచ్చుకొని మాట్లాడటానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు మళ్ళీ పెద్ద ఎత్తున అరవడంతో యాంకర్ సుమ పరుగుపరుగున వచ్చి ప్రియాంక దగ్గర ఉన్న మైక్ తీసుకొని ఆమెని పంపించింది దాంతో బిక్క మొహంతో వేదిక దిగింది పాపం .

హీరోయిన్ పై అభిమానులు అంతగా గోల చేసి ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఇద్దరు హీరోలు సైలెంట్ గా ఉండిపోయారు .అయితే అక్కడ ఏమి అవుతుందో ? వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో ఆ హీరోలకు సైతం తెలియలేదు దాంతో ఏమి చేయాలో పాలుపోక మిన్నకుండి పోయారు . హీరోల వ్యవహారం ఎలా ఉన్నా ఒక హీరోయిన్ మాట్లాడుతుంటే ఆమెని భయపెట్టడం , వెళ్ళిపో అనేలా అవమానించడం మాత్రం కరెక్ట్ కాదు .

- Advertisement -

English Title: vijay devarakonda fans insults priyanka jawalkar

Taxiwaala pre release event

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All