Homeటాప్ స్టోరీస్టాక్సీ వాలా ఆడుకుంటాడా ? ఆదుకుంటాడా ?

టాక్సీ వాలా ఆడుకుంటాడా ? ఆదుకుంటాడా ?

Real test for vijay devarakondaవిజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా ఈనెల 17 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే . అయితే సినిమా విడుదల కాకముందే మొత్తం రష్ ని ఎవరో దొంగిలించి చూసారు పూర్తీ ఎఫెక్ట్స్ లేకుండా . అలా చూడటం వల్ల అసలు సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉండదు అందుకే కాబోలు టాక్సీ వాలా ఫ్లాప్ అంటూ ఆ సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు . ఈ విషయం హీరో విజయ్ దేవరకొండ తో పాటుగా చిత్ర బృందం ఆలోచించి దానికి కౌంటర్ ఇవ్వడానికి ” ది రియాలిటీ బెహైండ్ టాక్సీ వాలా ” అంటూ ఓ వీడియో ని పోస్ట్ చేసారు . అంటే పూర్తి స్థాయిలో రీ రికార్డింగ్ కాకుండానే చూసిన సినిమా కాబట్టి దాన్ని జడ్జ్ చేయడం కష్టమని చెబుతున్నారు .

అయితే వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నప్పటికీ టాక్సీ వాలా చిత్రం హిట్ అయితే అతడి కొచ్చిన క్రేజ్ కి న్యాయం జరిగినట్లు అవుతుంది లేదంటే విజయ్ క్రేజ్ తో టాక్సీ వాలా ఆడుకున్నట్లే అవుతుంది . గీత గోవిందం చిత్రంతో అనూహ్యమైన క్రేజ్ విజయ్ దేవరకొండ వశం అయ్యింది . అయితే ఆ వెంటనే వచ్చిన నోటా చిత్రంతో పెద్ద దెబ్బే తగిలింది ఈ హీరోకు . మరి ఇప్పుడు ఈ టాక్సీ వాలా విజయ్ దేవరకొండ క్రేజ్ ని ఆడుకుంటాడా ? లేక ఆదుకుంటాడా ? చూడాలి . ఆ విషయం నవంబర్ 17 న తేలిపోనుంది .

- Advertisement -

English Title: Real test for vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All