Homeటాప్ స్టోరీస్మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda controversial comments again టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన టాక్సీ వాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి అందరి దృష్టి ని ఆకర్షించాడు . టాక్సీ వాలా చిత్రం విడుదలకు ముందే మొత్తం లీక్ అయిన విషయం తెలిసిందే దాంతో విజయ్ దేవరకొండ చాలా హర్ట్ అయ్యాడు అందుకే బోల్డ్ గా మాట్లాడాడు వేదిక మీద . మా సినిమాని పైరసీ చేసిన వాళ్ళకు మిడిల్ ఫింగర్ కనిపించేలా చేయాలనీ పిలుపునిచ్చాడు విజయ్ దేవరకొండ . ఒక సినిమా కోసం ఎంతోమంది కస్టపడి పనిచేస్తారని , ఇక టాక్సీ వాలా కోసం కూడా మేమెంతా చాలా కస్టపడి పనిచేశామని కానీ మా కష్టాన్ని దోచుకోవద్దని ఈ సినిమాపై ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయని అందుకే అందరూ థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలని తన అభిమానులను కోరాడు .

టాక్సీ వాలా వేదిక మీద ఆ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులను , నటీనటులను పరిచయం చేస్తూ వీళ్ళందరికీ మీ ఆశీస్సులు కావాలని కోరాడు విజయ్ దేవరకొండ . అయితే ప్రతీ ఈవెంట్ లో విజయ్ కొంచెం బోల్డ్ గా మాట్లాడటం మాత్రం వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది . దీనివల్ల అభిమానులకు సంతోశామేమో కానీ కొంతమందికి మాత్రం లోలోపల కోపం తెప్పించడం ఖాయం . దానివల్ల ముందుముందు విజయ్ కి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చు .

- Advertisement -

English Title: Vijay devarakonda controversial comments again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All