Homeటాప్ స్టోరీస్IMDB మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ రియల్ టైం పాపులారిటీ లో 7వస్థానం దక్కించుకున్న టాక్సీవాలా

IMDB మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ రియల్ టైం పాపులారిటీ లో 7వస్థానం దక్కించుకున్న టాక్సీవాలా

taxiwala movie is the 7th most anticipated indian film in imdbపెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా….రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవంబర్ 16న ఈచిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా IMDB మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ రియల్ టైం పాపులారిటీ లో టాక్సీవాలా 7వస్థానం దక్కించుకోవడం విశేషం. టాలీవుడ్ నుంచి టాప్ టెన్ లో టాక్సీవాలా చిత్రం మాత్రమే ఉండడం విశేషం.

 

- Advertisement -

విజయ్ దేవరకొండకున్న క్రేజ్, జిఏ2 పిక్చర్స్ కున్న క్రేజ్ తో ఈసినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమాకు క్రేజ్ బాగా పెరిగింది. గీత గోవిందం మేనియాతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగడం… అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఉండడంతో పాపులారిటీ అమాంతం పెరిగింది. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే పబ్లిసిటీలో దూసుకుపోతున్న ఈ చిత్రంలోని సింగిల్ ను రేపు విడుదల చేస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ శరవేగంగా జ‌రుపుకుంటోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌ మాట్లాడుతూ… విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మించాము. విజ‌య్ ఇమేజ్ కి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మేనరిజమ్స్ యూత్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. గీత గోవిందం వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఏర్పడిన అంచనాలను దృష్టిలో ఉంచుకొని టాక్సీవాలాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నాం. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రం లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జీఏ2 పిక్చర్స్ , యు.వి క్రియేషన్స్ క్వాలిటీ విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కావనే విషయం తెలిసిందే. కాగా…. imdb మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ రియల్ టైం పాపులారిటీ లో టాక్సీవాలా 7వస్థానం దక్కించుకోవడం విశేషం. టాలీవుడ్ నుంచి టాప్ టెన్ లో టాక్సీవాలా చిత్రం మాత్రమే ఉండడం చాలా సంతోషాన్నిచ్చింది. హిలేరియస్ సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలోని సింగిల్ ను రేపు విడుదల చేస్తున్నారు. టాక్సీవాలాను అత్యధిక థియేటర్లలో నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. అని అన్నారు.

 

నటీనటులు

 

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్, కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు

 

సాంకేతిక వర్గం

 

పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచర్ల
పిఆర్ఓ – ఏలూరు శ్రీను
సౌండ్ – సింక్ సినిమా
స్టంట్స్ – జాషువా
ఆర్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ రామిశెట్టి
లిరిక్స్ – కృష్ణ కాంత్
మ్యూజిక్ – జేక్స్ బిజాయ్
ఎడిటర్, కలరిస్ట్ – శ్రీజిత్ సారంగ్
సినిమాటోగ్రాఫర్ – సుజిత్ సారంగ్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – సాయి కుమార్ రెడ్డి
నిర్మాత – ఎస్ కె ఎన్ (SKN)
ప్రొడక్షన్ హౌజ్ – జీఏ 2 పిక్చర్స్ మరియు యువి క్రియేషన్స్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంక్రిత్యాన్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All