Homeటాప్ స్టోరీస్మరో ప్లాప్ మూటగట్టుకున్న విజయ్

మరో ప్లాప్ మూటగట్టుకున్న విజయ్

Vijay antony gets another flop బిచ్చగాడు చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ కి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది . అయితే బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి . దాంతో కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసిన సినిమా రోషగాడు . నిన్న విడుదలైన ఈ సినిమా కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . మంచి కంటెంట్ ఎంచుకున్నప్పటికీ దాన్ని సరైన దిశలో నడిపించడంలో విఫలమయ్యాడు దర్శకుడు గణేశా . తమిళ నేటివిటీ ఎక్కువగా ఉన్న రోషగాడు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం కష్టమే !

విజయ్ ఆంటోనీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది . నివేదా నటన ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది అయితే సినిమా స్లో నెరేషన్ వల్ల ప్రేక్షకులు అసహనానికి లోనౌతున్నారు . మొత్తానికి విజయ్ ఆంటోనీ కి బిచ్చగాడు చిత్రం తర్వాత రోషగాడు తప్పకుండా ఆ స్థాయి హిట్ అవుతుందని ఆశించాడు కానీ తమిళ్ లో హిట్ అవుతుందేమో కానీ టాలీవుడ్ లో మాత్రం యావరేజ్ మాత్రమే ! ఇక రేపు విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం విడుదల అవుతున్నందున ఈ విజయ్ ఆంటోనీ సినిమాని పట్టించుకునే వారు ఉంటారా ? డౌటే !

- Advertisement -

English Title: Vijay antony gets another flop

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All