Homeటాప్ స్టోరీస్రవితేజ - విజయ్ దేవరకొండలలో హిట్ కొట్టేది ఎవరు ?

రవితేజ – విజయ్ దేవరకొండలలో హిట్ కొట్టేది ఎవరు ?

War between Raviteja and Vijay devarakonda నవంబర్ 16 న రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం విడుదల అవుతుండగా ఆ మరుసటి రోజున విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం విడుదల అవుతోంది అంటే రెండు రోజుల్లో ఇద్దరు హీరోల చిత్రాలు విడుదల అవుతున్నాయి దాంతో ఆయా హీరోల అభిమానులతో పాటుగా సినీ లవర్స్ కూడా ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . అలాగే ఈ ఇద్దరు హీరోలలో హిట్ కొట్టేది ఎవరని ఆసక్తిగా మారింది . రవితేజ కు హిట్ లేక చాలా రోజులు అవుతోంది అలాగే విజయ్ దేవరకొండ కూడా ఇటీవలే నోటా తో డిజాస్టర్ అందుకున్నాడు . దాంతో ఇద్దరికీ హిట్ తప్పనిసరైంది . అయితే ఆ హిట్ కొట్టేది ఎవరు ? ఇద్దరూ హిట్ కొడతారా ? లేక ఒక్కరే హిట్ కొడతారా ? ఇద్దరూ ఫ్లాప్ బారిన పడతారా ?

శ్రీను వైట్ల – రవితేజ కాంబినేషన్ లో ఇంతకుముందు నీకోసం , దుబాయ్ శీను , వెంకీ చిత్రాలు రాగా అవి మూడు కూడా హిట్ అయ్యాయి . దాంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం పై అంచనాలు అయితే ఏర్పడ్డాయి . ఇక విజయ్ దేవరకొండ కు ఇటీవలే అనూహ్యంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . అయితే నోటా చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది . దాంతో ఈ టాక్సీ వాలా చిత్రం హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ . మరి ఈ ఇద్దరు హీరోలలో విజయం సాధించేది ఎవరు ? అన్నది ప్రేక్షకులు తీర్పు ఇవ్వనున్నారు మరో వారం రోజుల్లో .

- Advertisement -

English Title: War between Raviteja and Vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All