Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ మద్దతు కేసీఆర్ కా చంద్రబాబు కా ?

విజయ్ దేవరకొండ మద్దతు కేసీఆర్ కా చంద్రబాబు కా ?

Who will gets vijay devarakonda's supportతెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది . డిసెంబర్ 7 న తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కాగా డిసెంబర్ 11 న ఫలితాలు వెలువడనున్నాయి . తెలంగాణతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ కి ఎన్నికలు జరుగుతున్నాయి అయితే అందరి దృష్టి మాత్రం తెలంగాణ పైనే ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండోసారి వస్తున్న ఎన్నికలు కాగా కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో అన్న ఆత్రుత కూడా నెలకొని ఉంది అలాగే జాతీయ స్థాయిలో మరోసారి చక్రం తిప్పాలని చూస్తున్న చంద్రబాబు కి ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనున్నాయో అన్న ఆసక్తి కూడా నెలకొంది . అయితే ఈ ఎన్నికల్లో టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తన మద్దతు కేసీఆర్ కు ఇస్తాడా ? లేక చంద్రబాబు కు ఇస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది .

విజయ్ దేవరకొండకు చంద్రబాబు నాయుడు కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ? ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు వరకు విజయ్ దేవరకొండకు నచ్చిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడే మరి . అయితే తెలంగాణ విడిపోయింది కేసీఆర్ పాలన నడుస్తోంది కాబట్టి విజయ్ లో చిన్న మార్పు వచ్చింది . కేసీఆర్ , కేటీఆర్ ల నాయకత్వం పట్ల ఆకర్షితుడయ్యాడు దానికి తోడు కేటీఆర్ తో పలుమార్లు సమావేశం కావడంతో విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు . ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి . మరి ఈ ఎన్నికల్లో విజయ్ దేవరకొండ ఎవరికి మద్దతు ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేసీఆర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: Who will gets vijay devarakonda’s support

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All