Homeటాప్ స్టోరీస్టాక్సీ వాలా ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు

టాక్సీ వాలా ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు

Negative talk spreads on vijay devarakonda's TAXIWALAవిజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా చిత్రం ఫ్లాప్ అంటూ కొంతమంది అదేపనిగా ప్రచారం చేస్తున్నారు . ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలుసా ……… టాక్సీ వాలా చిత్రం ఇంతకుముందు మొత్తం లీకైన సంగతి తెలిసిందే . గీత గోవిందం చిత్రంతో పాటుగా టాక్సీ వాలా చిత్రం కూడా మొత్తం లీక్ అయ్యింది అయితే అది రఫ్ ఎడిషన్ కావడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు . సినిమా మొత్తం లీక్ కావడంతో ఆ సినిమాని చూసిన వాళ్ళు టాక్సీ వాలా చిత్రం బాగోలేదని అంటున్నారు . అంతేకాదు టాక్సీ వాలా సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం చేస్తున్నారు . ఆ టాక్ ఇప్పుడు టాలీవుడ్ ని ఊపేస్తోంది .

రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ చూసి ఈ సినిమా ఇలాగే విడుదల చేస్తే ఫ్లాప్ అవుతుందని చెప్పి సినిమా విడుదల వాయిదా వేయించాడు . ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు నవంబర్ లో విడుదల చేయిస్తున్నారు . నవంబర్ 16 న టాక్సీ వాలా చిత్రం విడుదల కానుంది . విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్రం గత నెలలో విడుదలై ఘోర పరాజయం పొందింది . ఇక ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ అయితే దారుణమే !

- Advertisement -

English Title: Negative talk spreads on vijay devarakonda’s TAXIWALA

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All