Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ టాక్సీ వాలా విడుదల కాదా ?

విజయ్ దేవరకొండ టాక్సీ వాలా విడుదల కాదా ?

Taxiwala facing release problemవిజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది , రిలీజ్ డేట్ ఎపుడో అనౌన్స్ చేసారు ఇక విడుదల కావడమే ఆలస్యం అనుకున్న సమయంలో అల్లు అరవింద్ టాక్సీ వాలా సినిమాని చూశాడట ! ఇంకేముంది నచ్చలేదు దాంతో వెంటనే సినిమా విడుదల ఆపేసాడు . మళ్ళీ రీ షూట్ చేయాల్సిన సన్నివేశాల గురించి , గ్రాఫిక్స్ గురించి సలహాలు ఇచ్చాడట కానీ ఇదంతా జరిగి మూడు నెలలు కావస్తోంది కానీ సినిమా విడుదల మాత్రం కావడం లేదు .

టాక్సీ వాలా సినిమా తర్వాత రావాల్సిన గీత గోవిందం ముందుగా వచ్చింది ,బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో విజయ్ దేవరకొండకు ఎనలేని క్రేజ్ తెచ్చింది . కట్ చేస్తే ఇప్పుడు స్టార్ స్టేటస్ పొందుతున్నాడు విజయ్ దేవరకొండ . అయితే నోటా సినిమాని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కానీ టాక్సీ వాలా ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టినట్లున్నారు . మే లేదా జూన్ లో అనుకున్న సినిమా డిసెంబర్ అయినా వచ్చేలా కనిపించడం లేదు . అక్టోబర్ లో నోటా వస్తోంది కాబట్టి డిసెంబర్ లో టాక్సీ వాలా రిలీజ్ చేద్దామని భావిస్తున్నారట . మరి అప్పుడైనా రిలీజ్ అవుతుందా ? లేదా ? అన్నది చూడాలి .

- Advertisement -

English Title: Taxiwala facing release problem

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All