Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ వై ఎస్ జగన్ పాత్రలో

విజయ్ దేవరకొండ వై ఎస్ జగన్ పాత్రలో

Is Vijay Deverakonda playing Jagan in Yatraగీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ కాగా గీత గోవిందం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో తాజాగా యాత్ర అనే బయోపిక్ చిత్రంలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే అది నిజామా ? అంటే డౌటే ! అయితే ఈ ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు . దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” యాత్ర ” . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే . జగపతిబాబు , అనసూయ , పోసాని తదితర ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు .

ఇక వై ఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించనున్నట్లు తెలిసింది అయితే అది ఇప్పుడు బెడిసి కొట్టినట్లు దాంతో ఆ పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది . దర్శకుడు మహి విజయ్ ని అడిగాడట కానీ ఇంకా విజయ్ దేవరకొండ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు . ఒకవేళ విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇస్తే యాత్రలో జగన్ పాత్రలో కనిపిస్తాడు లేదంటే జగన్ పాత్రలో మరో నటుడు . గీత గోవిందంతో అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ యాత్రలో నటించడానికి ఒప్పుకుంటాడా ? అన్నది పెద్ద ప్రశ్నే !

- Advertisement -

English Title: Is Vijay Deverakonda playing Jagan in Yatra

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All