Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండతో కొరటాల శివ

విజయ్ దేవరకొండతో కొరటాల శివ

Koratala siva planning film with vijay devarakondaవిజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ దర్శకులు కొరటాల శివ కు ఎప్పటి నుండో ఉందట ముఖ్యంగా పెళ్ళి చూపులు చిత్రం చూసిన తర్వాత అనుకన్నాడట ! ఈలోగా అర్జున్ రెడ్డి వచ్చింది ఇంకేముంది విజయ్ దేవరకొండ లోని మరో కోణాన్ని చూపించింది . సరే ! అలాంటి స్టొరీ ఒకటి రాసుకుందామని అనుకునేలోగా గీత గోవిందం వచ్చింది దాంతో వీటికి భిన్నంగా విజయ్ దేవరకొండ తో ఏదో చేయాలనీ ఉందట కొరటాల శివకు . వరుసగా చేసిన నాలుగు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దాంతో కొరటాల శివతో సినిమా చేయడానికి పలువురు హీరోలు పోటీ పడుతున్నారు అయితే కొరటాల మాత్రం విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నాడు .

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ సిద్దం చేసుకుంటున్నాడు కొరటాల . చిరంజీవి సైరా నరసింహారెడ్డి షూటింగ్ ముగించుకొని కొరటాల శివ తో జాయిన్ అవుతాడు . వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా ప్రారంభం కానుండగా చిరుతో సినిమా కంప్లీట్ చేసాక విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . సందేశాత్మక చిత్రాలు చేసే కొరటాల విజయ్ దేవరకొందతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి .

- Advertisement -

English Title: Koratala siva planning film with vijay devarakonda

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All