Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ -రవితేజలలో గెలిచేది ఎవరు ?

విజయ్ దేవరకొండ -రవితేజలలో గెలిచేది ఎవరు ?

Big fight between Vijay devarakonda and Raviteja బాక్సాఫీస్ బరిలో విజయ్ దేవరకొండరవితేజ ల మద్య భీకర పోరుకి రంగం సిద్దం అవుతోంది . అయితే ఈ ఇద్దరి మద్య పోటీలో విజయం సాధించేది ఎవరో ? అన్నది మాత్రం ప్రేక్షకులే తేల్చనున్నారు . ఈ ఇద్దరి మద్య పోటీ ఏంటి ? అని అనుకుంటున్నారా ? రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం అలాగే విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా నవంబర్ 16 న విడుదలకు సిద్దం అవుతున్నాయి. టాక్సీ వాలా చిత్ర విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు ఇక ప్రకటించాల్సింది రవితేజ సినిమాని మాత్రమే ! రవితేజ సినిమాని అధికారికంగా ప్రకటించలేదు కానీ నవంబర్ 16 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించింది , అయితే సవ్యసాచి ఈ నవంబర్ 2 న రిలీజ్ అవుతుండటంతో వారం గ్యాప్ ఇచ్చి డేట్ ప్రకటించనున్నారట . రవితేజ కు గతకొంత కాలంగా కలిసి రావడం లేదు . వరుసగా చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి . ఇక విజయ్ దేవరకొండ కు ఇటీవలే నోటా చిత్రంతో పెద్ద షాక్ తగిలింది అయితే అతడికి క్రేజ్ బాగానే ఉంది దాంతో ఓపెనింగ్స్ అయితే బాగానే వస్తాయి . సినిమా బాగుంటే హిట్ అవుతుంది లేదంటే షరా మాములే ! అయితే ఇద్దరి మద్య మాత్రం పోటీ తీవ్రంగా ఉండటం ఖాయం . మరి ఆ పోటీలో నిలిచేది ఎవరు ? గెలిచేది ఎవరు ? అన్నది మాత్రం ప్రేక్షకులు డిసైడ్ చేయనున్నారు .

- Advertisement -

English Title: Big fight between Vijay devarakonda and Raviteja

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All