Homeటాప్ స్టోరీస్రవితేజ ని దెబ్బకొట్టిన నేల టిక్కెట్టు

రవితేజ ని దెబ్బకొట్టిన నేల టిక్కెట్టు

raviteja shocked with nela ticket result మాస్ మహారాజ్ రవితేజ కు నేల టిక్కెట్టు దెబ్బకొట్టింది , ఒక్క ముక్కలో చెప్పాలంటే నేల టిక్కెట్టు నాకించేసింది టోటల్ గా ఆ చిత్ర బృందాన్ని . నిన్న విడుదలైన నేల టిక్కెట్టు చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు , దాంతో సినిమాకు ప్లాప్ టాక్ వచ్చేసింది . సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ఉన్నప్పటికీ సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో సినిమా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . సోగ్గాడే చిన్నినాయనా వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో సినిమాపై అంచనాలు ఉండే .

కానీ ఆ అంచనాలను అందుకోలేక చతికిల బడింది నేల టిక్కెట్టు . రామ్ తాళ్ళూరి ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించాడు , అయితే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది . సినిమా లో పేరున్న నటీనటులు చాలామందే ఉన్నారు కానీ వాళ్ళ నుండి నటన ని రాబట్టుకోవడంలో సరైన పాత్ర చిత్రణ చేయడంలో కళ్యాణ్ కృష్ణ ఘోరంగా విఫలమయ్యాడు . ఇక రవితేజ కూడా టచ్ చేసి చూడు వంటి ప్లాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఆశలు పెట్టుకున్నాడు కానీ దెబ్బ కొట్టేసింది , నేల నాకించేసింది . దాంతో రవితేజ నేల టిక్కెట్టు రిజల్ట్ పట్ల షాక్ అయ్యాడట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All