
నాగ శౌర్య, రీతూ వర్మ కలిసి నటించిన సినిమా వరుడు కావలెను. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ మొదటి వారంలో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. వరుడు కావలెను చిత్రం ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించబడింది. ఈరోజు రాధా కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వరుడు కావలెను టీజర్ ను విడుదల చేసారు.
టీజర్ చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్పాలి. చాలా ఆటిట్యూడ్ తో ఉండే 30 ఏళ్ల అమ్మాయిని ఇష్టపడే సాఫ్ట్ స్పోకెన్ అబ్బాయికి మధ్య జరిగే ఆసక్తికర లవ్ ట్రాక్ ఈ చిత్రం. అటు మ్యూజిక్ పరంగా, ఇటు డైలాగ్స్ పరంగా కూడా టీజర్ మెప్పించింది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
అక్టోబర్ లో వరుడు కావలెను విడుదలవుతుందని టీజర్ ద్వారా తెలియజేసారు. ప్రస్తుతం నాగ శౌర్య మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అందులో వరుడు కావలెను ముందుగా విడుదలవుతుంది.
Coming a step closer to all of you,
Sharing all the more fun filled Teaser♥️#VarudukaavalenuTeaser▶️ https://t.co/y5de1StJiD@riturv @LakshmiSowG @vamsi84 @Composer_Vishal @ganeshravuri @vamsi84 @vamsi_p1988 @NavinNooli @adityamusic @sitharaents pic.twitter.com/xFm47Uth8o
— Naga Shaurya (@IamNagashaurya) August 31, 2021
