
వరసగా సినిమాలను ఒప్పుకుని కొద్ది నెలల గ్యాప్ లోనే వాటిని విడుదల చేయడం అప్పట్లో జరిగేది కానీ ఇప్పుడు క్రేజ్ ఉండట్లేదు. నితిన్ వరస నెలల్లో విడుదల చేసిన చెక్, రంగ్ దే ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో మనం చూసాం. ఇదిలా ఉంటే నాగ శౌర్య ఇప్పుడు అదే తప్పు చేసినట్లు తెలుస్తోంది.
నాగ శౌర్య వరసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్నాడు. వరుడు కావలెను షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తోన్న లక్ష్య చిత్రానికి కూడా కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మహేష్ కోనేరు నిర్మాణంలో పోలీస్ వారి హెచ్చరిక చేస్తున్నాడు.
కరోనా సెకండ్ వేవ్ ముగిసాక ఈ నాలుగు చిత్రాలను పూర్తి చేసి విడుదల చేసి ప్రమోట్ చేయడం అనేది శౌర్యకు కత్తి మీద సాము వంటిదే.